ETV Bharat / state

young man dies in America: చెదిరిన కల..! అమెరికాలో తెలుగు యువకుడిపై కాల్పులు.. అక్కడికక్కడే మృతి - Shooting on Telugu young man in America

Shooting on Telugu young man in America : అమెరికా వెళ్లాలని, ఉన్నత చదువులు పూర్తి చేసి ఉద్యోగం సాధించాలని ఆ యువకుడు కల గన్నాడు. తల్లి సహకారంతో బ్యాంకు రుణం తీసుకుని అమెరికా వెళ్లి రెండేళ్లుగా పార్ట్ టైం జాబ్ చేస్తూ కష్టపడుతున్నాడు. మరో నెల రోజుల్లో ఎంఎస్ పూర్తవుతుందనగా.. ఉహించని ఘోరం జరిగిపోయింది. ఉద్యోగం సాధించి తిరిగి వస్తాడనుకున్న కుమారుడు.. ఇక లేడు అని తెలిసి ఆ తల్లి గుండె తల్లడిల్లుతోంది.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Apr 21, 2023, 1:27 PM IST

young man dies in America: అమెరికాలో గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో తెలుగు యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. ఏలూరుకు చెందిన వీర సాయి అమెరికాలో ఎంఎస్ చదువుతున్నాడు. ఆ యువకుడు రెండు సంవత్సరాల క్రితం చదువు నిమిత్తం అమెరికా వెళ్లాడు. అక్కడ పార్ట్ టైం కింద పెట్రోల్ బంక్ లో పనిచేస్తూ చదువుకుంటున్నాడు. ఈ తరుణంలో వెస్ట్ కొలంబస్ లో కొందరు గుర్తు తెలియని దుండగులు డబ్బు కోసం ఆ యువకుడి పై అమానుషంగా కాల్పులు జరిపారు. అర్ధరాత్రి 12:50 గంటలకు దోపిడీని అడ్డుకునే ప్రయత్నంలో సాయి హత్యకు గురైనట్లు ఇక్కడికి సమాచారం అందింది.

ఏలూరులో విషాద ఛాయలు... పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన సాయి కుటుంబం ఏలూరులో స్థిరపడ్డారు. సాయి తండ్రి ఎల్​వైఆర్.. సీఆర్ఆర్ కళాశాలలో ఎకనామిక్స్ అధ్యాపకుడిగా పనిచేశాడు. ఇటీవల ఆయన మృతి చెందగా.. ఇద్దరు కుమారుల్లో చిన్న వాడైన సాయి అమెరికాలో చదువుతున్నాడు. ఈ విషాద సంఘటన తెలుసుకున్న కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు. వాళ్లు నివసిస్తున్న అపార్ట్మెంట్ అంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. అమెరికాలో చదువుకున్న తెలుగు విద్యార్థులపై ఇటువంటి సంఘటన జరుగుతున్నాయని.. తమ కుమారుడికి జరిగినట్లు ఇతర విద్యార్థులు ఎవరికీ జరగకుండా ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులకు కోరుతున్నారు. వీలైనంత త్వరగా తమ కుమారుడి మృతదేహాన్ని స్వగృహానికి తరలించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

మా అన్నయ్య గారి అబ్బాయి అమెరికాలో ఎంఎస్ చేస్తున్నాడు. పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుకుంటున్నాడు. ఇంకో నెల రోజుల్లో ఎంఎస్ పూర్తి చేసి జాబ్​ లో చేరతాడని సంతోషించాం. కానీ, ఇంతలోపే ఘోరం జరిగిపోయింది. నైట్ షిఫ్ట్ లో వచ్చిన డబ్బు ను దోపిడీ చేసేందుకు వచ్చిన వాళ్లు కాల్పులు జరపడంతో చనిపోయాడని మృతి చెందాడు. ఇలాంటి పరిస్థితి ఇంకే తల్లి దండ్రులకూ రాకూడదు. అధికారులు వీలైనంత త్వరగా సాయి మృతదేహాన్ని ఇండియాకు రప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. తానా బాధ్యులు సహకరించి అక్కడి ఫార్మాలిటీస్ పూర్తి చేసి పార్థివదేహాన్ని పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. - మృతుడు బాబాయ్

మాది పక్క అపార్ట్​మెంట్. సాయి కుటుంబంతో మాకు చక్కటి అనుబంధం ఉంది. తండ్రి చనిపోయినా ఇద్దరు కుమారులు కష్టపడి చదువుతున్నారు. పెద్ద కుమారుడు ఇక్కడే ఉద్యోగం చేస్తునాడు. చిన్న కుమారుడిని అమెరికా పంపడానికి తల్లి ఎంతో కష్టాలకోర్చి బ్యాంకు రుణాలు తీసుకుని పంపించింది. - మహేశ్వర్ రావు, అపార్ట్​మెంట్ వాసి

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.