ETV Bharat / state

పురిటి బిడ్డను రూ.30 వేలకు అమ్మేశారు

పోషించలేమన్న భయంతో అప్పుడే పుట్టిన బిడ్డను అమ్ముకున్నారు ఆ దంపతులు. ఓ ఆర్​ఎంపీ వైద్యుడి మాటలకు ఒప్పుకుని 30 వేల రూపాయలకు పసి బిడ్డను అమ్ముకున్నారు. చివరికి అధికారులకు వ్యవహారం తెలియటంతో బిడ్డను శిశు గృహానికి చేర్చారు.

child selling
child selling
author img

By

Published : Aug 12, 2020, 5:10 AM IST

పేదరికంతో కడుపున పుట్టిన బిడ్డను తల్లిదండ్రులు అమ్మేసిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజమహేంద్రవరం సమీపంలోని ఓ గ్రామంలో బాలమ్మ, దొరబాబు అనే దంపతులు కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. కొన్ని రోజుల క్రితం బాలమ్మ మరో బిడ్డకు జన్మనిచ్చింది. హైదరాబాద్​కు చెందిన ఓ జంటకు 30 వేల రూపాయలకు బిడ్డను విక్రయించారు బాలమ్మ- దొరబాబు దంపతులు. ఈ వ్యవహారంలో ఓ ఆర్​ఎంపీ మధ్యవర్తిత్వం చేశారు.

బిడ్డ పుట్టక ముందే ఒప్పందం

హైదరాబాద్​కు చెందిన ఓ జంటకు పెళ్లై 14 సంవత్సరాలైన సంతానం కలగలేదు. వీరికి రాజమహేంద్రవరానికి చెందిన ఓ ఆర్​ఎంపీ వైద్యుడు పరిచయమయ్యాడు. ఎవరైనా పిల్లలు ఉంటే పెంచుకుంటామని వైద్యుడికి వారు తెలిపారు. ఈ క్రమంలో బాలమ్మ, దొరబాబును వైద్యుడు కలిశాడు.

'ఇప్పటికే మీకు ఇద్దరు సంతానం ఉన్నారు. మరొక బిడ్డ పుడితే మీరు ఎలా పెంచగలరు. పిల్లలు లేని ఓ దంపతులు నన్ను సంప్రదించారు. ఎవరైనా పిల్లలు ఉంటే తమకు ఇస్తే పెంచుకుంటామని తెలిపారు. మీకు పుట్టే బిడ్డ ఆడ పిల్లయినా, మగ పిల్లవాడైన వారికి ఇస్తే మీకు 30,000 ఇస్తారు' అని వారికి వైద్యుడు నచ్చజెప్పి ఒప్పించాడు. రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బాలమ్మ ఈ నెల రెండో తేదీన మగబిడ్డకు జన్మనిచ్చింది. అనుకున్న ప్రకారం బిడ్డను తీసుకువెళ్లాలని హైదరాబాద్​లోని జంటకు వైద్యుడు ఫోన్ చేశాడు. అయితే కరోనా నేపథ్యంలో ఇప్పుడు అక్కడికి రావడం కుదరదని.. భీమవరంలోని తమ కుటుంబ సభ్యులు వచ్చి డబ్బులు ఇచ్చి పిల్లాడిని తీసుకువెళ్తారని వారు తెలిపారు. ఆ విధంగా ఈ నెల ఆరో తేదీన బిడ్డ భీమవరం చేరాడు.

ఇలా దొరికారు

పసిబిడ్డ ఆ ఇంట్లోకి కొత్తగా రావటంతో చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చి అంగన్​వాడీ కార్యకర్త, వాలంటీర్​కు విషయం తెలిపారు. వారు భీమవరం పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. బాలుడి తల్లిదండ్రులకు ఐసీడీఎస్ అధికారులు కౌన్స్​లింగ్ ఇచ్చారు. పసిబిడ్డను ఏలూరులోని శిశు గృహానికి తరలించారు.
ఇదీ చదవండి

నీళ్లు అడిగినందుకు చంపేశారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.