ETV Bharat / state

పశ్చిమలో పెరుగుతున్న కరోనా కేసులు

పశ్చిమ గోదావరి జిల్లాలో రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఒక్క రోజులో 13 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇందులో ఒక్క కేసు మినహా మిగిలిన 12 మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వలస కూలీలుగా అధికారులు గుర్తించారు.

13 more corona cases recorded
పశ్చిమలో పెరుగుతున్న కరోనా కేసులు
author img

By

Published : May 21, 2020, 3:37 PM IST

పశ్చిమ గోదావరి జిల్లాలో 24 గంటల వ్యవధిలో 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. వీటితో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 87 కు చేరుకొంది. ఇందులో 54మంది కోవిడ్ నుంచి కోలుకొని ఇళ్లకు చేరారు. 33 యాక్టివ్ పాజిటివ్ కేసులకు ఏలూరు ఆశ్రమ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

పెదవేగి మండలం పినకడిమిలో 11, పెనుగొండ మండలం సిద్ధాంతం, పెదపాడు మండలంలోని రాజుపేటలో ఒక్కొక్క పాజిటివ్ కేసు నమోదైంది. ఒక్క రాజుపేట మినహా మిగిలిన అన్ని పాజిటివ్ కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులవిగా అధికారులు నిర్ధరించారు.

జిల్లాలో 25,615 నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 87 పాజిటివ్​గా నిర్ధరణ కాగా 23,220 నెగిటివ్ రిపోర్టులు వచ్చాయి. 2, 337 రక్తనమూనాల పరీక్షించామని తెలిపిన అధికారులు.. వాటికి సంబంధించిన ఫలితాలు ఇంకా రావాల్సి ఉందని చెప్పారు.

ఇవీ చూడండి:

ఇసుక అక్రమాలను ప్రశ్నిస్తే వేధింపులా..?:పవన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.