విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణ పోలీస్ స్టేషన్లో భాజపా నేత ద్వారపురెడ్డి శ్రీనివాసరావుపై వైకాపా నాయకులు ఫిర్యాదు చేశారు. గుడి నిర్మాణం విషయంలో వాస్తవాలు తెలుసుకోకుండా భాజపా నాయకులు మాట్లాడటం సరైందికాదని నాయకులు పేర్కొన్నారు. శ్రీనివాసరావు ప్రజలను అలగా జనం అని ప్రస్తావించటంతోపాటు కులం,మతం పేరుతో దూషణలు చేశారని నాయకులు ఫిర్యాదులో వెల్లడించారు. ఫోన్ సంభాషణలో శ్రీనివాసరావు ఎమ్మెల్యే జోగారావు పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
ఇదీచదవండి
భార్య నగ్న వీడియోలతో వ్యాపారం.. దర్యాప్తులో విస్తుపోయే అంశాలు