కొవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా సచివాలయ ఉద్యోగాల భర్తీకి రాతపరీక్షలు నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఆర్.మహేష్‌కుమార్ సూచించారు. సెప్టెంబరు 20 నుంచి 26 వరకు జరిగే ఈ పరీక్షలకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు.
కరోనా నిబంధనలను పాటిస్తూ పరీక్షలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. పరీక్షల నిర్వహణలో ప్రత్యేకాధికారులదే కీలక పాత్ర అని స్పష్టం చేశారు. ప్రతీ కేంద్రం వద్ద అభ్యర్థుల శారీరక ఉష్ణోగ్రతను తనిఖీ చేయాలన్నారు. కొవిడ్ లక్షణాలు ఉన్నవారి కోసం ప్రతీ కేంద్రం వద్ద ప్రత్యేకంగా ఒక ఐసోలేషన్ గదిని ఏర్పాటు చేయాలన్నారు.. నిబంధలనకు అనుగుణంగా ప్రతీ కేంద్రం వద్ద తాగునీరు, మరుగుదొడ్లు తదితర వసతులను మంగళవారం అన్ని పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి, నివేదిక ఇవ్వాలని జెసి ఆదేశించారు. పరీక్షా కేంద్రాల ప్రత్యేకాధికారులకు ఒకరోజు శిక్షణా కార్యక్రమం కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎం.వెంకటేశ్వర్రావు, జిల్లా పంచాయితీ అధికారి కె.సునీల్ రాజ్‌కుమార్, డిప్యూటీ సిఇఓ కె.రామచంద్రరావు, స్పెషల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: రెండు నెలల్లో పెరిగిన కరోనా మృతుల సంఖ్య