విజయనగరం జిల్లా వేపాట మండలం జగ్గయ్యపేటకు చెందిన కోసూరు రామలక్ష్మికి కల్లేపల్లికి చెందిన శ్రీనుతో వివాహమైంది. రామలక్ష్మీ గర్భవతిగా ఉన్న సమయంలో ఇంటి ఆవరణలోని కొబ్బరి చెట్టు కింద కూర్చొని ఉండగా..తలపై కొబ్బరికాయ పడింది. ఆ తర్వాత అనారోగ్యం పాలై..మతిస్థిమితం కోల్పోయి పుట్టింటికి చేరుకుంది. కొంత కాలానికి ఆమె తల్లి చనిపోవటంతో రామలక్ష్మీ రోడ్డు పడింది.
గత 5 సంవత్సరాలుగా కనిపించకుండా పోయి...ఊర్లు తిరుగుతూ మహారాష్ట్రకు చేరుకుంది. అక్కడి పోలీసులు ఆమెను శారద ఫౌండేషన్ వారికి 2019లో అప్పగించగా..వారు ఏడాదిన్నర పాటు వైద్య సేవలు అందించటంతో ఆమె ఆరోగ్యం సాధారాణ స్థితికి వచ్చింది. అనంతరం రామలక్ష్మి స్వగ్రామం జగ్గయ్యపేటకు పంపించారు. ఐదేళ్ల తర్వాత వచ్చిన రామలక్ష్మీని చూసి ఉళ్లోని బంధువులు ఆనందం వ్యక్తం చేశారు.
ఇదీచదవండి