విజయనగరం జిల్లా కురుపాంలో ఏడాదిగా సంచరిస్తున్న అడవి ఏనుగులను తరలించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారు. జియ్యమ్మవలస మండలం బాసంగి గ్రామానికి చెందిన గంట చిన్నమ్మి(55) వరికోతకు వెళ్లగా ఏనుగులు దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి అడవి ఏనుగులను తరలించేటట్లు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: పార్వతీపురంలో ఉల్లి కోసం తోపులాట