ETV Bharat / state

AOB: 'ఆంధ్రాలోనే ఉంటాం.. కొఠియా ప్రాంత గ్రామస్తుల తీర్మానం'

ఆంధ్రాలోనే ఉంటామంటూ తీర్మానం చేసిన వివాదస్పద కొఠియా ప్రాంత గ్రామాల ప్రజల్ని అధికారులు సత్కరించారు. విజ్ఞాపన పత్రం అందించేందుకు వచ్చిన గ్రామస్తులకు ముందుగా ఐటీడీఏ పీవో కూర్మనాథ్ స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. 70 ఏళ్లుగా ఈ గ్రామాలు ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల మధ్య నలుగుతున్నాయని, ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న సంక్షేమ పథకాలు నచ్చి.. ఇక్కడ ఉండేందుకు నిర్ణయించుకున్నారని తెలిపారు.

AOB
AOB
author img

By

Published : Oct 25, 2021, 9:15 PM IST

ఆంధ్రా - ఒడిశా స‌రిహ‌ద్దులోని కొఠియా గ్రామాల్లో గ‌త కొన్ని రోజులుగా ఒడిశా అధికారులు, ప్రజాప్రతినిధులు సృష్టిస్తున్న వివాదాలను సమర్థవంతగా ఎదుర్కొంటున్న ఆ ప్రాంత గిరిజనులను విజయనగరంజిల్లా కలెక్టర్ సూర్య‌కుమారికి, ఐటీడీఏ పీవో కూర్మనాథ్, తదితర అధికారులు ఘనంగా సత్కరించారు. క‌లెక్ట‌రేట్ కు విచ్చేసిన కొఠియా గ్రామాల ప్ర‌జ‌ల‌ను జిల్లా అధికారులు మేళ తాళాల న‌డుమ, స‌న్నాయి వాయిద్యాల‌తో సాద‌రంగా ఆహ్వానించారు. తామంతా ఆంధ్రప్రదేశ్ లోనే ఉంటామ‌ని చేసిన తీర్మాన‌ ప‌త్రాల‌ను కలెక్టర్ సూర్య‌కుమారికి కొఠియా గ్రామాల ప్రజలు అందచేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నుంచి తమకు అన్ని విధాలుగా స‌హాయ‌, స‌హ‌కారాలు అందించాల‌ని, సంక్షేమ ప‌థ‌కాలు పూర్తిస్థాయిలో కొన‌సాగించాల‌ని కలెక్టర్ కు కొఠియా వాసులు విన్నవించుకున్నారు.

కొఠియా గ్రామాల నుంచి ఇంత‌మంది ధైర్యంగా వ‌చ్చి ఆంధ్ర‌లోనే ఉంటామ‌ని చెప్ప‌డం నిజంగా హ‌ర్షించ‌ద‌గ్గ విష‌య‌మ‌ని కలెక్టర్ పేర్కొన్నారు. ఆంధ్రా - ఒడిశా స‌రిహ‌ద్దుల్లోని కొఠియా గ్రామాల్లో వివాదాలు గ‌త కొన్నేళ్లుగా సాగుతున్నాయని, వీటికి సంబంధించిన‌ పాత నివేదిక‌ల‌న్నీ ప‌రిశీలించామ‌ని వెల్ల‌డించారు. ఇది చాలా సున్నిత‌మైన స‌మ‌స్య.. దీన్ని సామ‌ర‌స్యంగా ప‌రిష్క‌రించాల్సిన ఆవ‌శ్య‌క‌త ఉంద‌న్నారు. గ‌త కొన్ని రోజులుగా జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు రాష్ట్ర ప్ర‌భుత్వానికి నివేదిస్తున్నామ‌ని తెలిపారు.

ప్ర‌భుత్వం నుంచి వ‌చ్చే సూచ‌న‌ల‌ను, స‌లహాల‌ను అనుస‌రించి భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ రూపొందిస్తామన్నారు. ఈ లోగా జిల్లాస్థాయిలో చేయాల్సిన అన్ని ప‌నులు చేపడతామ‌ని చెప్పారు. చ‌ట్ట‌బ‌ద్ధంగా, న్యాయ‌ప‌రంగా అందాల్సిన అన్ని సేవ‌లను కొఠియా ప్రజలకు అందిస్తామ‌న్నారు. కొఠియా వాసులు అంద‌జేసిన విన‌తిని రాష్ట్ర ప్ర‌భుత్వానికి నివేదిస్తామ‌ని కలెక్టర్ తెలియజేశారు. ఈ కార్యక్రమానికి కొఠియా ప‌రిధిలోని గంజాయిభ‌ద్ర‌, ప‌ట్టుచెన్నూరు, ప‌గులుచెన్నూరు పంచాయ‌తీల‌కు చెందిన స‌ర్పంచులు, ఎంపీటీసీలతో పాటు 50మంది స్థానిక ప్ర‌జ‌లు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ఆంధ్రా-ఒడిశా సరిహద్దు కొఠియాలో మరోసారి ఉద్రిక్తత.. పొలీసులపై గిరిజనుల తిరుగుబాటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.