భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జిల్లాలో తాగునీటి కష్టాలు తీర్చడానికి స్వజల్ పథకంలో భాగంగా రూ.496 కోట్లు మంజూరయ్యాయని జిల్లా పంచాయతీ అధికారి సునీల్ కుమార్ తెలిపారు. శుక్రవారం భోగాపురం మేజర్ పంచాయతీని పరిశీలించారు. వీధుల్లో పర్యటించి మౌలిక వసతులపై ఆరా తీశారు. పంచాయతీల్లో ఎక్కడైతే మంచినీటి సమస్య వేధిస్తుందో... అక్కడ ఈ పథకం ద్వారా తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని సూచించారు.
జిల్లాకు 230 పథకాలకు రూ.496 కోట్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. వీటితో పాటు 14వ ఆర్థిక సంఘం నిధులలో జిల్లాకు 96 కోట్లు కేటాయించారని చెప్పారు. వీటిని తాగునీరు, పారిశుద్ధ్యం, పంచాయతీ సిబ్బంది వేతనాలు, విద్యుత్ నిర్వహణ తదితర వాటికి ఖర్చు చేయాలన్నారు. భోగాపురం మేజర్ పంచాయతీలో బట్టి కాలువ సమస్య తీవ్రంగా ఉందన్నారు. దీనిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. అనంతరం గ్రామ సచివాలయ భవన నిర్మాణాలను పరిశీలించారు.
ఇదీ చదవండి :