కరోనా వైరస్ వ్యాప్తి నివారణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు విజయనగరం జిల్లా పోలీసులు వినూత్న ప్రయత్నం చేశారు. ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాలన్న సందేశంతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎస్పీ రాజకుమారి ఆధ్వర్యంలో... కరోనా వైరస్ను పోలిన వేషధారణతో సిబ్బంది విజయనగరంలో ఈ ప్రదర్శన చేపట్టారు. గంట స్తంభం నుంచి ప్రారంభమైన ర్యాలీ.. నగరంలోని ప్రధాన వీధుల మీదుగా సాగింది. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రస్తుతం కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉందని, ఈ నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రజలకు మేమున్నాం అన్న భరోసా కల్పించే ఉద్దేశ్యంతో ఈ వినూత్న ర్యాలీ చేపట్టామని ఆమె తెలియచేశారు.
ఇదీ చదవండి: