విజయనగరం జిల్లా సాలూరు మండలం మావిడి పంచాయతీ గాది పిల్లివలస గ్రామంలో మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. కోత కోసి ఆరబెట్టిన మొక్కజొన్నలు వర్షాలకు పూర్తిగా తడిచిపోయి... మొలకలు వచ్చాయి. ఎంతో కష్టపడి పండించిన పంట కళ్ల ముందే పాడైపోతుందని రైతలు ఆవేదన చెందుతున్నారు.
ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. సాలూరు మండలంలో సుమారు 2130 ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతోంది. వర్షాలకు అత్యధిక రైతుల పరిస్థితి ఇలానే ఉంది. గతంలో మాదిరిగా ప్రభుత్వం పరదాలు ఇవ్వలేదని రైతులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: