ETV Bharat / state

అందని తడి... ఎండుతున్న మడి..!

ఓ వైపు పచ్చటి పైర్లతో కళకళలాడుతున్న పొలాలు. ఆకువాలి దిగాలుగా మారిన నారుమళ్లు మరోవైపు. ఇది విజయనగరం జిల్లాలో ప్రస్తుతం ఖరీఫ్ సీజనల్​లో నెలకొన్న విభిన్న పరిస్థితులు. వర్షాలకు జిల్లాలోని జలాశయాలన్నీ పూర్తి స్థాయి నీటి మట్టంతో తొణికిసలాడుతున్నాయి. ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టు మొత్తం పచ్చటి పైర్లతో కళకళలాడుతోంది. కానీ వర్షాధార మండలాల్లో మాత్రం కరవు ఛాయలు నెలకొన్నాయి. సీజన్ ఆరంభంలో జోరు వర్షాలతో పైర్లు వేశారు. అది పెరిగి నాట్లకు వచ్చేసరికి పరిస్థితి తారుమారైంది. అప్పుడప్పుడు చిరుజల్లులు కురుస్తున్నా పైరుకు ఊపిరి పోసేలా లేవు. చుక్కనీరు అందించలేని స్థితిలో అన్నదాతలు నైరాశ్యంలో కొట్టుమిట్టాడుతున్నారు.

vizianagaram farmers facing problems
vizianagaram farmers facing problems
author img

By

Published : Sep 8, 2020, 1:00 AM IST

Updated : Sep 8, 2020, 7:58 PM IST

అందని తడి... ఎండుతున్న మడి..!

విజయనగరం జిల్లాలోని జంఝావతి, పెద్దగెడ్డ, ఒట్టిగెడ్డ, వెంగళరాయసాగర్, ఆండ్ర, తాడిపూడి, తోటపల్లి ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా జలశయాలన్నింటిలోనూ నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరింది. ప్రాజెక్టులన్నీ, నిండుకుండను తలపిస్తుండటంతో ఆయకట్టు మొత్తం పచ్చని పైర్లతో కళకళలాడుతోంది. జలాశయాలలో నీటిమట్టం సంతృప్తికర స్థాయికి చేరటంతో ప్రస్తుత సీజన్ కే కాకుండా..రబీకి పుష్కలంగా నీరుంటుందని రైతులు భరోసా వ్యక్తం చేస్తున్నారు. అయితే., వర్షాధార ప్రాంతాలు మాత్రం ఎడారిని తలపిస్తున్నాయి. ఎండలు వేసవిని తలపిస్తుండటంతో వరి నారు మడులను నిలబెట్టేందుకు రైతులు పలు వ్యయప్రయాసలకు గురవుతున్నారు.

విజయనగరం జిల్లా జిల్లావ్యాప్తంగా జూన్ నెలలో సాధారణ వర్షాపాతం 128.4మిల్లీ మీటర్లు కాగా., 142.04మి.మీటర్ల వర్షం కురిసింది. జులైలో 178.70మి.మీటర్లకు గాను., 175.5మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. దీంతో రైతులందరూ ఖరీఫ్ పంటల సాగుపై ఆశలు పెంచుకున్నారు. అయితే సాగుకు కీలకమైన ఆగస్టులో మాత్రం.. 187మిల్లీమీటర్లకు గాను 91.1 మిల్లీమీటర్లు మాత్రమే వర్షం కురిసింది. ఈ పరిస్థితుల్లో 34మండలాల్లో 16మండలాల్లో లోటు వర్షపాతం నెలకొంది. 18మండలాల్లో సాధారణ వర్షం కురిసింది. ఈ పరిస్థితుల్లో ఖరీఫ్ పంటల సాగు విషయానికొస్తే.., జిల్లా ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 1,81,811హెక్టార్లు కాగా.., వర్షాభావం కారణంగా ఇప్పటి వరకు 99,910హెక్టార్లలో మాత్రమే సాగయ్యాయి. ప్రధానంగా వరి 1,22,007హెక్టార్లకు గాను నేటికీ 64వేల హెక్టార్లలో మాత్రమే సాగైంది. కానీ., వర్షాదార ప్రాంతాలలో కరవు పరిస్థితులు నెలకొన్నాయి.

ముదిరిపోయిన నారు..

విజయనగరం రెవెన్యూ డివిజన్ లో సాగునీటికి గడ్డు పరిస్థితి. విజయనగరం, డెంకాడ, భోగాపురం, పూలసపాటిరేగ, నెల్లిమర్ల, గుర్ల, గరివిడి, చీపురుపల్లి, దత్తిరాజేరు, గజపతినగరం, బొండపల్లి, గంట్యాడ, వేపాడ, కొత్తవలస, ఎల్.కోట మండలాల్లో ఇప్పటికీ 20శాతం కూడా నాట్లు పడ లేదు. దీంతో పొలాలన్నీ బీళ్లుగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు వర్షాలు కురిసిన ప్రయోజనం లేదు. నారు ముదిరిపోయింది. నాట్లు వేసినా దిగుబడులు వచ్చే పరిస్థితి ఉండదని రైతులు చెబుతున్నారు..

ఆశలు వదలుకోవాల్సిందే...

ఇదిలా ఉండగా ఇప్పటికే రైతులు వరి నాడుమడులు వేసి మూడు నెలలు కావొస్తోంది. నారు ముదిరిపోయింది. వేసిన నాట్ల పరిస్థితి కూడా అగమ్యగోచరంగా మారింది. గత వారం రోజులుగా వేసవిని తలపించేలా ఎండలు మండుతున్నాయి. దీంతో వరి నారు మడులు నిలబెట్టుకునేందుకు రైతులు నానాపాట్లు పడుతున్నారు. సాగునీటి వనరులు కూడా తక్కువగా ఉండటంతో ప్రస్తుతం వరి నారు, లేత మడులను బతికించుకునేందుకు రైతులు ఇంజన్లతో నీటి తడులు అందిస్తూ అవస్థలు పడుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే., ఖరీఫ్ పై ఆశలు వదులుకోవాల్సిందేనని రైతులు నిట్టూరుస్తున్నారు.

సుజల స్రవంతిని పూర్తి చేయాలి..

జిల్లాలోని వర్షాధార ప్రాంతాల్లో ప్రతియేటా ఇదే పరిస్థితి. సకాలంలో వర్షాలు కురవకపోవటం., కురిసినా అరకొర వర్షపాతం నమోదు కావటంతో., రైతులు నష్టాలు పరిపాటిగా మారాయని రైతు నాయకులు వాపోతున్నారు. ఈ గడ్డు పరిస్థితులను చక్కదిద్దేందుకు సుజల స్రవంతి పథకాన్ని చేపట్టాలని గత మూడు దశాబ్దాలుగా ఘోషిస్తున్నా.. పాలకులకు చెవికెక్కటం లేదని ఆరోపిస్తున్నారు.

విత్తనాలు అందజేస్తాం...

విజయనగరం జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్ స్థితిగతులపై ప్రభుత్వానికి నివేదించినట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లా పరిస్థితులను బట్టి వరిసాగుకు ఈ నెల 10 వరకు గడువుందన్నారు. అప్పటికీ సరైన వర్షం కురవకపోతే స్వల్పకాల వరి రకాలు లేదా.. ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను అందజేస్తామని వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు తెలియచేశారు.

ఇదీ చదవండి

ఔరా..! ఇంజినీర్లుగా మారారు...వంతెననే నిర్మించారు

Last Updated : Sep 8, 2020, 7:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.