ETV Bharat / state

'గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోంది' - విజయనగరం జిల్లా నేటి వార్తలు

విజయనగరం కలెక్టరేట్​లో జిల్లాస్థాయి సమావేశం జరిగింది. జిల్లా పాలనాధికారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల పంపిణీపై చర్చ జరిగింది.

vizianagaram district collector meeting with officers in  Collectorate
విజయనగరం కలెక్టరేట్​లో జిల్లాస్థాయి సమావేశం
author img

By

Published : Oct 19, 2020, 7:51 PM IST

జిల్లాలో సుమారు 50 వేల ఎక‌రాల‌కు ఆర్ఓఎఫ్ఆర్ ప‌ట్టాలు పంపిణీ చేయ‌నున్న‌ట్లు విజయనగరం పాలనాధికారి ఎం. హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్ అన్నారు. సంబంధిత అధికారుల‌తో జిల్లా స్థాయి క‌మిటీ స‌మావేశం నిర్వహించిన ఆయన... గిరిజ‌నుల సంక్షేమానికి ప్ర‌భుత్వం అధిక ప్రాధాన్య‌త‌నిస్తోంద‌ని తెలిపారు.

ఏళ్ల ‌త‌ర‌బ‌డిగా గిరిజనులు సాగు చేసుకుంటున్న అట‌వీ భూముల‌పై హ‌క్కు క‌ల్పించి, ఆయా భూముల అభివృద్దికి ప్ర‌ణాళిక‌లు రూపొందించాల‌ని సూచించారు. ప‌ట్టాల పంపిణీకి ప్ర‌తిపాద‌న‌లు సిద్దం చేయాల‌న్నారు. ఇందుకు సంబంధించి... ఈ నెల 22న స‌మావేశాన్ని ఏర్పాటు చేయాల‌ని అధికారులను ఆదేశించారు.

ఇదీ చదవండి:

తెదేపా కమిటీల ప్రకటన... బలహీన వర్గాలకు పెద్దపీట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.