ETV Bharat / state

గిరిజన విద్యార్థిని చదువుకు కలెక్టర్ భరోసా - vizianagaram district collector hari jawaharlal helps poor student

పేద కుటుంబానికి చెందిన విద్యార్థిని చదువుకు.. విజయనగరం జిల్లా కలెక్టర్ హరిజవహర్​లాల్ భరోసా కల్పించారు. ఐటీడీఏ నిధుల నుంచి విద్యార్థినికి అవసరమైన ఫీజును చెల్లించాలని.. ఐటీడీఏ పీవో కూర్మనాథ్​కు సూచించారు.

vizianagaram district collector hari jawaharlal helps for studies of poor student
గిరిజన విద్యార్థిని చదువుకు కలెక్టర్ భరోసా
author img

By

Published : Feb 27, 2021, 2:17 PM IST

పేద కుటుంబానికి చెందిన విద్యార్థిని చదువుకు విజయనగరం జిల్లా పాలనాధికారి హరిజవహర్​లాల్ భరోసా కల్పించారు. గుమ్మలక్ష్మీపురానికి చెందిన ఎం.అంజలి.. బొబ్బిలిలోని ఓ కళాశాలలో బీ ఫార్మసీలో చేరింది. అనంతరం అనారోగ్యంతో ఇంటికే పరిమితమైంది. కోలుకున్నాక.. కళాశాలకు వెళ్లగా రూ.లక్ష చెల్లిస్తేనే సీటిస్తామని చెప్పగా.. శుక్రవారం కలెక్టరుకు సమస్య తెలియజేసింది.

ఆయన కళాశాల ప్రిన్సిపల్​తో మాట్లాడి, ఫీజు చెల్లించే ఏర్పాటు చేస్తానని, సీటు ఇవ్వాలని కోరారు. ఐటీడీఏ పీవో కూర్మనాథ్​తోనూ మాట్లాడి.. అవసరమైన ఫీజును ఐటీడీఏ నిధుల నుంచి చెల్లించాలని సూచించారు. బీ ఫార్మసీ పూర్తి చేసి మంచి ఉద్యోగంలో స్థిరపడాలని విద్యార్థినికి కలెక్టర్ సూచించారు.

ఇదీ చదవండి:

నేడు కాళేశ్వరంలో శ్రీవారికి మాఘ పూర్ణిమ పుణ్య స్నానం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.