విజయనగరం జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట నష్ట పోయిన రైతులందరికీ పరిహారం చెల్లించడానికి అన్ని చర్యలు చేపడతామని కలెక్టర్ హరి జవహర్లాల్ తెలియచేశారు. గొల్లలపాలెంలో పాడైన పంటలను పరిశీలించారు. తమ్మయ్య చెరువు ఆయకట్టు కొత్తకాపుపేటలో 12 ఎకరాలు, గొల్లలపేటలో 2 ఎకరాల వరి పంట నీట మునిగిందని రైతులు కంచే నాయుడు, రాజేష్ కలెక్టర్ ముందు వాపోయారు.
కలెక్టర్ రైతులతో మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల మేరకు రావలసిన నష్ట పరిహారాన్ని చెల్లిస్తామన్నారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దన్నారు. జిల్లాలో 40 హెక్టార్లలో వరి, 50 హెక్టార్లలో మొక్కజొన్న, 97 ఎకరాలలో పత్తి పంటలకు నష్టం జరిగినట్లు ప్రాధమికంగా అంచనా వేశామన్నారు. నష్టాన్ని ఈ-క్రాప్‌లో నమోదు చేయాలని.. బాధిత రైతులు, పంట నష్టం వివరాలను రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శించాలని వ్యవసాయాధికారులకు సూచించారు.
ఇవీ చదవండి...