విజయనగరం జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ఎస్పీ రాజకుమారి ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఏర్పాట్లను పరిశీలించారు. ఆర్టీసీ అధికారులకు, సిబ్బందికి, కరోనా కేసులు పెరగకుండా ఉండేందుకు సలహాలు అందించారు. బస్సులో ప్రయాణించే ప్రయాణికులకు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. లేనిపక్షంలో బస్సు ఎక్కడానికి అనుమతించవద్దని పేర్కొన్నారు.
కరోనా నియంత్రణకు కావలసిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. భౌతిక దూరం పాటించాలని సూచించారు. కరోనా నియంత్రణకు జాగ్రత్తలు పాటిస్తూ.. బస్సులను నడిపిస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.
ఇదీ చదవండి: ఎల్జీ పాలిమర్స్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా