జిల్లాలో రోజుకు 5 వేలకు తక్కువ కాకుండా కొవిడ్ పరీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని కొవిడ్ కమాండ్ కంట్రోల్ రూంను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. కరోనా రోగుల హోం ఐసోలేషన్, టేపింగ్, టెస్టింగ్, కాంటాక్ట్ ట్రేసింగ్, మ్యాపింగ్, డిశ్ఛార్జ్, ఫీవర్ కేసులు తదితర అంశాలపై ఆయా విభాగాల సిబ్బందితో ఆయన సమీక్షించారు. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి వైద్యుల ద్వారా లేదా ఏఎన్ఎంల ద్వారా అందుతున్న సేవలపై ప్రశ్నించారు.
రోజుకు సగటున 5 వేల కరోనా పరీక్షలు నిర్వహించాలని.., ఆరువేల పరీక్షలు నిర్వహించేందుకు అనుగుణంగా రోజువారీ ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించారు. ప్రతీ కేసును తప్పనిసరిగా మ్యాపింగ్ చేయటంతోపాటు 50ఏళ్లకు పైబడిన వారిని ఆసుపత్రికి తరలించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇదీచదవండి