విజయనగరం జిల్లా కొమరాడలో తాగునీటి కోసం ప్రజలు ఆందోళనకు దిగారు. మూడు నెలలుగా తాగునీరు లేక అవస్థలు పడుతున్నామని వాపోయారు. ఖాళీ బిందెలతో ట్యాంకు వద్ద నిరసన చేపట్టారు. ఎన్నిసార్లు మెురపెట్టుకున్నా.. ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ విన్నపాన్ని ఆలకించి ఇప్పటికైనా అధికారులు తాగునీరు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇదీచదవండి