విజయనగరం జిల్లా పాచిపెంట మండలం ఈతమానువలసలో అమానవీయ ఘటన జరిగింది. కరోనా సోకిన వ్యక్తి కుటుంబీకులను అక్కడ గ్రామస్థులు వెలివేశారు. ఓ వ్యక్తికి కరోనా రావడంతో అధికారులు ఆస్పత్రికి తరలించారు. బాధితుడితో సంబంధం ఉన్న 15 మంది కుటుంబసభ్యులను ఆసుపత్రికి తరలించలేదని గ్రామస్థులు ఆగ్రహాం వ్యక్తం చేశారు. వెంటనే వారిని ఊరినుంచి వెలివేశారు. చేసేదేం లేక, ఎటువెళ్లాలో తెలియక వారు చిన్నపిల్లలతో సహా ఊరు బయట పశువులపాకలో తలదాచుకున్నారు. రాత్రి వర్షం కురవడంతో బాధితులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఘటనపై పాచిపెంట మండల తహసీల్దార్ విచారణ చేపట్టారు.
ఇదీ చూడండి.