విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ చేసిన ఓ పని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు మంత్రి బొత్స సత్యనారాయణకు శుభాకాంక్షలు తెలిపేందుకు ఆయన ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ సూర్యకుమారి, సంయుక్త కలెక్టర్ కిశోర్ కుమార్, మహేష్ కుమార్లు కూడా మంత్రి ఇంటికి వెళ్లారు. మంత్రి బొత్సతో పాటు ఆయన భార్య ఝూన్సీకి శుభాకాంక్షలు తెలిపారు.
జేసీ కిషోర్ కుమార్ కూడా మంత్రి బొత్స దంపతులకు పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. అనంతరం శుభాకాంక్షలు తెలిపి ఆయనకు పాదాభివందనం చేశారు. జేసీ తీరుతో అక్కడున్న వారంతా షాకయ్యారు.
ఇదీ చూడండి:
Liquor Sales: ఏరులై పారిన మద్యం.. నిన్న ఒక్కరోజే ఎన్ని కోట్ల అమ్మకాలంటే..