విజయనగరం జిల్లా అదనపు డీఎంహెచ్‌వో ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ తనిఖీలు చేపట్టింది. భారీగా ఆస్తులు కూడబెట్టారన్న సమాచారంతో అదనపు డీఎంహెచ్‌వో రవికుమార్‌రెడ్డి ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. ఆయనకు సంబంధించి పదిచోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు. రవికుమార్ కుటుంబ సభ్యులు, బంధువులు ఇళ్లు, కార్యాలయాల్లో ఆస్తులపై ఆరా తీస్తున్నారు.
విజయనగరం, పార్వతీపురంలో, బొబ్బిలి, విశాఖ, రాజమహేంద్రవరంతో పాటు మరికొన్నిచోట్ల సోదాలు చేస్తున్నారు. పలు కీలక దస్త్రాలతో పాటు విలువైన ఆస్తులను గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు.
ఇదీ చూడండి: పాఠశాల విద్యా కమిటీ ఎన్నికలో ఘర్షణ.. పోలీసులు, ఉపాధ్యాయులపైకి రాళ్లు