ETV Bharat / state

'రేపటి నుంచి ఈ నెల 31 వరకు రెండో డోసు మాత్రమే' - vijayanagaram collector latest news

విజయనగరం జిల్లాలో రేపటి నుంచి 31వ తేదీ వరకు వ్యాక్సినేషన్ కేంద్రాల్లో రెండో డోసు మాత్రమే వేస్తారని జిల్లా కలెక్టర్ డా.హరి జవహర్ లాల్ వెల్లడించారు. మొదటి డోసు వ్యాక్సినేషన్ జూన్ మొదటి వారం నుంచి మాత్రమే చేపడతామని పెర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశించిందని చెప్పారు.

collector harijaahar lal
విజయనగరం జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్
author img

By

Published : May 9, 2021, 4:44 PM IST

రేపటి నుంచి ఈనెల 31 వతేదీ వరకు కొవిడ్ వ్యాక్సిన్ కేంద్రాల్లో రెండో డోసు మాత్రమే వేస్తారని విజయనగరం జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్ తెలిపారు. జూన్ నుంచి మొదటి డోసు వ్యాక్సిన్ చేపడతామన్నారు. మొదటి డోసు కోసం ఇప్పటివరకు బుక్ చేసుకున్న స్లాట్లు రద్దవుతాయని స్పష్టం చేశారు.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని వెల్లడించారు. రెండో డోసు ఏ కేంద్రంలో ఏ తేదీన వేసుకోవాలన్నది.. మొదటి డోసు తీసుకున్నవారి.. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు సందేశం పంపనున్నట్లు చెప్పారు. వ్యాక్సిన్ వృథాను అరికట్టడానికే ఎంపిక చేసిన కేంద్రాల్లో టీకా వేస్తున్నామన్నారు.

ఇదీ చదవండి:

కొవిడ్ ఎఫెక్ట్: ఆర్టీసీ ప్రయాణానికి ప్రజలు దూరం..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.