విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో నిరుపేదలకు సాయం అందించడానికి యూటీఎఫ్ నాయకులు ముందుకు వచ్చారు. చేయి, చేయి కలిపారు. సుమారు లక్ష రూపాయలు విరాళాలు సేకరించారు. గిరిజనులకు, పారిశుద్ధ్య కార్మికులకు సరుకులు పంపిణీ చేశారు. మండలంలో రేగ పుణ్యగిరి దబ్బగుంట, చిట్టం పాడు, లక్ష్మీపురం, గాదెలోవ గిరిజన గ్రామాలకు చెందిన 450 మంది గిరిజనులకు అందించారు. పట్టణంలో పారిశుద్ధ్య సిబ్బందికీ సరుకులు సమకూర్చారు.
ఇదీ చదవండి: