గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గోగులతోటకు చెందిన నాగేశ్వరరావు, ఆంజనేయులు.. విజయనగరం జిల్లా భోగాపురంలోని ఓ దుకాణాదారునికి తక్కువ ధరకు బంగారం ఇస్తామని నమ్మించారు. అతని నుంచి రూ.2.5లక్షలు తీసుకుని నకిలీ బంగారం కడ్డీని అప్పగించి పరారయ్యారు. బంగారు కడ్డీని కరిగించగా అది నకిలీ బంగారమని తేలటంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. మరో ఘటనలో నాగేశ్వరరావు, ఆంజనేయులు.. విజయనగరం తోటపాలెంలోని కిరాణాకొట్టు యజమానినీ ఇదే తరహాలో మోసగించారు. బాధితురాలి వద్ద నుంచి రూ.1.5లక్షలు వసూలు చేశారు. మోసాన్ని ఆలస్యంగా గ్రహించిన మహిళ.. పోలీసులకు ఫిర్యాదు చేసింది.
భోగాపురం, విజయనగరంలో ఒకే తరహా మోసాలు జరగటంతో విజయనగరం సీసీఎస్ పోలీసులు నిఘా పెట్టారు. భోగాపురం మిఠాయి దుకాణంలోని సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాల ఆధారంగా దర్యాపు చేపట్టిన సీసీఎస్ పోలీసులు.. నిందితుల ఫోన్ నంబరుతో వారి చిరునామాను గుర్తించారు. నకిలీ బంగారంతో మోసాలకు పాల్పడిన నాగేశ్వరరావు, ఆంజనేయులును అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.3.90లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ అనిల్ కుమార్ తెలిపారు.
ఇదీచదవండి.