విజయనగరం జిల్లా గుర్ల మండలం పెనుబర్తి జంక్షన్లో రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి పాలకొండ వైపు ప్రయాణిస్తున్న కారును గుర్తుతెలియని వాహనం ఢీకొనటంతో ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న తల్లి, కుమార్తెలు తీవ్రంగా గాయపడ్డాడు. వారిద్దరిని జిల్లాలోని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: