విజయనగరం జిల్లా సాలూరు మండలం కురుకూటి పంచాయతీ పరిధిలోని గిరిజనులు లాక్డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పీఎం కిసాన్ యోజన కింద రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.2 వేల నగదును అధికారులు జమచేశారు. జీరో అకౌంట్ ఉన్న మహిళకు రూ.500 నగదు జమచేశారు. వాటిని తీసుకునేందుకు ఇంటర్నెట్ సిగ్నల్స్ లేక ఆ ప్రాంత గిరిజనులు అవస్థలు పడుతున్నారు. ఊరి పొలిమేరల్లో సిగ్నల్ అందటంతో గ్రామస్థులంతా ఊరు శివారుకు చేరుకుంటున్నారు. భౌతిక దూరం పాటిస్తూ... చేతులకు శానిటైజర్ రాసుకుని వేలుముద్ర వేసి నగదు తీసుకుంటున్నట్లు బ్యాంకు మిత్ర వివరించారు.
ఇదీ చూడండి:
బ్యాంకుల ఎదుట గుంపులుగా జనం... కారాదు ప్రమాదం!