TSRTC New Buses: ప్రయాణికులకు సౌకర్యవంతమైన సేవలను అందించేందుకు తెలంగాణ ఆర్టీసీ కొత్త బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. 392 కోట్ల వ్యయంతో అధునాతనమైన వెయ్యి 16 బస్సులను కొనుగోలు చేయాలని సంస్థ నిర్ణయించింది. 630 సూపర్ లగ్జరీ, 130 డీలక్స్, 16 స్లీపర్ బస్సులను కొనుగోలుకు యాజమాన్యం టెండర్లను ఆహ్వానించింది. ఇందుకు సంబంధించి అన్ని బస్సులు. మార్చి నాటికి ఆర్టీసీ చేతికి అందనున్నాయి.
తొలి విడతలో వచ్చిన 50 బస్సులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ప్రారభించనున్నారు. హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై నేటి మధ్యాహ్నం 2 గంటలకు ఆయన కొత్త సూపర్ లగ్జరీ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు. కొత్త సూపర్ లగ్జరీ బస్సుల్లో సాంకేతికతను జోడించారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ట్రాకింగ్ సిస్టంతో పాటు ప్యానిక్ (panic) బటన్ సదుపాయం కల్పించారు. ఇబ్బందులు ఎదురైతే ఈ బటన్‌ను నొక్కగానే ఆర్టీసీ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందుతుంది.
తక్షణమే అధికారులు స్పందించి అవసరమైన చర్యలు తీసుకుంటారు. ప్రతి బస్సులోనూ సౌకర్యవంతమైన 36 రిక్లైనింగ్ సీట్లున్నాయి. ఎల్ఈడీ డిస్‌ప్లే బోర్డులను ఏర్పాటు చేశారు. సెక్యూరిటీ కెమెరాలతో పాటు ప్రతి బస్సుకు రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా కూడా ఉంది. ఫైర్ డిటెక్షన్ అండ్ అలారం సిస్టం ఏర్పాటు చేశారు. బస్సులో ఉష్ణోగ్రత పెరిగినా అలారం మోగుతుంది. అగ్నిప్రమాదాలు జరిగితే ఎఫ్‌డీఏఎస్ విధానం వల్ల వెంటనే చర్యలు తీసుకోవచ్చు.
ఇవీ చదవండి: