విజయనగరం జిల్లా కొత్తవలస మండలం రెల్లి రెవెన్యూ పరిధిలోని అప్పన్నదొరపాలెంలో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం కోసం గతంలో శంకుస్థాపన చేసి ఆవిష్కరించిన నామ ఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. నామ ఫలకం బిగించడానికి నిర్మిచిన గోడను కూలదోశారు.
గిరిజన వర్సిటీ కోసం అప్పటి తెదేపా ప్రభుత్వం అప్పన్నదొరపాలెంలో 526.24 ఎకరాలు కేటాయించింది. ఆ భూముల చుట్టూ ప్రహరీ నిర్మాణనికి 5కోట్ల రూపాయల కేటాయించింది. నాటి మంత్రి సుజయ కృష్ణ రంగారావు ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన చేసి., నామ ఫలకాన్ని ఆవిష్కరించారు. సుమారు 2కిలోమీటర్ల పొడవు ప్రహరీ గోడ సైతం నిర్మించారు. ప్రభుత్వం మారడంతో పనులు నిలిచిపోయాయి.
గిరిజన ప్రాంతంలోనే గిరిజన వర్సిటీ ఉండాలన్న వైకాపా నిర్ణయంతో అప్పన్నదొరపాలెంలో ఎక్కడి పనులు అక్కడే నిలిచి పోయాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు గిరిజన వర్సిటీ కోసం పాచిపెంట మండలం పెదకంచెరు రెవెన్యూ పరిధిలోని భూములను తాజాగా కలెక్టర్ హరి జవహర్ లాల్ పరిశీలించారు. ఈ సమయంలో వర్సిటీ కోసం గతంలో ప్రతిపాదిత భూముల శంకుస్థాపన శిలా ఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం విస్మయం కలిగిస్తోంది. వర్సిటీ తరలిపోతుందన్న ఉద్దేశ్యంతో దీనిని ధ్వంసం చేసారా..లేక కావాలనే ఎవరైనా ఈ దుశ్చర్యకు పాల్పపడ్డారా అన్నది తేలాల్సి ఉంది...
ఇవీ చదవండి: పొరుగు రైతులతో తగాదాలు.. విద్యుత్ టవర్ ఎక్కి రైతు....