జిల్లాలో రెండోవిడత పంచాయతీ ఎన్నికలు రేపు జరగనున్నాయి. ఈ విడతలో మొత్తం 248 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా.. కోర్టు ఆదేశాల మేరకు 4 పంచాయతీలను మినహాయించి, 244 పంచాయతీలకు, 2330 వార్డులకు ఎన్నికలను నిర్వహించనున్నారు. వీటిలో 37 సర్పంచ్, 610 వార్డులు ఏకగ్రీవం అయ్యాయని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం 207 పంచాయతీలు, 1720 వార్డులకు ఎన్నికలు జరుగునున్నాయి. మొత్తం 3,60,181 మంది.. తమ ఓటుహక్కును వినియోగించుకొనున్నారు. 2,030 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని అధికారులు చెప్పారు.
తొలివిడత ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని... ఈసారి కౌంటింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ చెప్పారు. కౌంటింగ్‌ను సకాలంలో ప్రారంభించి, రాత్రి 10 గంటలకల్లా పూర్తి చేసేలా.. ప్రణాళికను రూపొందించామన్నారు.
రెండోవిడత ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేశాం. 207 పంచాయతీల్లో 62 సమస్యాత్మక ప్రాంతాలు, 46 అతి సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రత్యేకంగా సాయుధ దళాలను వినియోగించనున్నాం. 82 రూట్ మొబైల్ టీమ్స్, 80 స్ట్రైకింగ్ ఫోర్సెస్, మరో 80 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్‌ని ఏర్పాటు చేశాం. ఇప్పటివరకు ఈ ప్రాంతాల్లోని 17,046 మందిపై బైండోవర్ చేశాం. 7వేల లీటర్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నాం. 88వేల రూపాయల సారాయి ఊటలను ధ్వంసం చేశాం.-బి.రాజకుమారి, ఎస్పీ
ఇదీ చదవండీ.. సంబరాలు జరగాల్సిన ఇంట్లో.. అంతులేని విషాదం!