విజయనగరంలో మూడు లాంతర్ల జంక్షన్లో కూల్చివేతపై ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి స్పందించారు. పట్టణాన్ని కార్పొరేషన్ స్థాయికి ఎదిగేలా చేసేందుకు పట్టణంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్టు చెప్పారు. ఈ క్రమంలోనే.. మూడు లాంతర్ల జంక్షన్ వద్ద నూతన నిర్మాణాన్ని చేపట్టేందుకు శంకుస్థాపన చేశామన్నారు.
మాజీ మంత్రి అశోక గజపతిరాజు.. ఈ విషయాన్ని అనవసరంగా రాజకీయం చేస్తూ.. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహించారు. మూడు లాంతర్లను.. చారిత్రక కట్టడమని.. పురాతన కట్టడమని ఆయన నిరూపిస్తే.. ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.
ఇదీ చూడండి: