విజయనగరం జిల్లా కొమరాడ మండలం గుమడాలో కుటుంబ కలహాలతో ఓ భర్త తన భార్యను గొడ్డలితో నరికి చంపాడు. గ్రామానికి చెందిన సిరిపురం ఊర్మిళ, కిషోర్ భార్య భర్తలు. కొన్నాళ్లుగా వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. భర్తతో ఇటీవల గొడవపడి ...ఊర్మిళ అదే గ్రామంలోని తల్లి ఇంటికి వెళ్లిపోయింది. కిషోర్ భార్య ఉంటున్న ఇంటికి వెళ్లి గొడ్డలితో దారుణంగా నరికాడు.
స్థానికులు గమనించి కుటుంబీకులతో కలిసి బాధితురాలిని 108 వాహనంలో పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే ఊర్మిళ మృతి చెందిందని తెలిపారు. ఇంఛార్జ్ ఎస్ఐ జయంతి సంఘటనా ప్రాంతానికి వెళ్లి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
ఇదీ చూడండి.
పోలీసుల దాడులు.. అక్రమ మద్యం స్వాధీనం