చలి కుంపటి కారణంగా ఓ వృద్ధురాలు సజీవదహనం అయింది. విజయనగరం జిల్లా పార్వతీపురంలోని అమ్మిగారికోనేరు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు మేరకు అమ్మిగారికోనేరు సమీపంలోని పూరిళ్ల వద్ద ఆదివారం అర్ధరాత్రి 2గంటల సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మూడు పూరిళ్లు పూర్తిగా కాలిపోగా...ఒంటరిగా ఉంటున్న సావిత్రమ్మ అనే ఓ వృద్ధురాలు సజీవదహనమైంది. మిగిలిన రెండు పూరిళ్లలో ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. కానీ వంటసామాగ్రి పూర్తిగా కాలిపోయింది. అగ్నిప్రమాదానికి సావిత్రమ్మ గుడిసెలోని చలి కుంపటే కారణం కావచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండీ...