ETV Bharat / state

కక్షతోనే మాన్సాస్ ట్రస్ట్​ నిర్వీర్యం: కళా వెంకట్రావు

పంచభూతాలను దోచుకోవడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నైజమని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు ధ్వజమెత్తారు. విజయనగరం మహారాజా కళాశాల ప్రైవేటీకరణను ఖండిస్తున్నట్లు తెలిపిన ఆయన.. సీఎం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

tdp state president kala venkat rao on mansus trust at vijayawada
కక్షతోనే మాన్సాస్ ట్రస్ట్​ నిర్వీర్యం: కళా వెంకట్రావు
author img

By

Published : Oct 2, 2020, 8:03 PM IST

Updated : Oct 2, 2020, 8:18 PM IST

విజయనగరం మహారాజా కళాశాల ప్రైవేటీకరణను ఖండిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెదేపా రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు పేర్కొన్నారు. అశోక్ గజపతిరాజుపై కక్షతో మాన్సాస్ ట్రస్ట్​ను నిర్వీర్యం చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. పంచభూతాలను దోచుకోవడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నైజమని ధ్వజమెత్తారు. పాదయాత్ర సమయంలోనే ఈ స్వచ్ఛంద సంస్థపై జగన్ కన్ను పడిందని ఆయన ఆరోపించారు.

మాన్సాస్ ట్రస్ట్​ను భ్రష్టుపట్టించడమే లక్ష్యంగా ఏ1, ఏ2లు తెరవెనుక పావులు కదుపుతున్నారని దుయ్యబట్టారు. ట్రస్ట్​ విషయంలో ప్రభుత్వం అనవసర జోక్యం చేస్తుందని ఆరోపించారు. సామాజిక సేవా కార్యకలాపాలను దెబ్బతీయడమే కాక సంస్థ ఉద్యోగుల జీవితాలతో ఆటలాడుకోవడం గర్హనీయని వ్యాఖ్యానించారు.

tdp state president kala venkat rao on mansus trust at vijayawada
కక్షతోనే మాన్సాస్ ట్రస్ట్​ నిర్వీర్యం: కళా వెంటకట్రావు

ఇదీ చూడండి:

'మా పార్టీకి సిద్ధాంతాలున్నాయి.. ఎమ్మెల్యేలు రాజీనామా చేసి రావాల్సిందే'

Last Updated : Oct 2, 2020, 8:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.