సాధారణంగా కొత్త ప్రభుత్వం ఏర్పడ్డకా ఏడాది పాటు ప్రతిపక్షానికి పని ఉండదని, కానీ వైకాపా అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల ద్వారా ఆరు నెలలల్లోనే ప్రతిపక్షాలకు పనిభారం పెరిగిందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు ఎద్దేవా చేశారు. విజయనగరం ఒకటో వార్డులోని వేణుగోపాల్ నగర్లో తెదేపా ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేణుగోపాల్ నగర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి... చైతన్య యాత్రను ప్రారంభించారు. అనంతరం తెదేపా శ్రేణులు గడప గడపకు వెళ్లి.... వైకాపా ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను కరపత్రాల ద్వారా వివరించారు. విశాఖలో 50వేల ఐటీ ఉద్యోగాల కల్పనపై ఆ శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలను అశోక్ తప్పుపట్టారు. ఉన్న ఉద్యోగాలనే తొలగించారు... లేని వాటిని ఎక్కడి నుంచి తీసుకొస్తారని ప్రశ్నించారు. 'ఒట్టి మాటలు కట్టిపెట్టి., గట్టిమేలు తలపెట్టువోయి'... అంటూ మహాకవి గురజాడ వ్యాఖ్యలను ఈ సందర్భంగా అశోక్ ప్రస్తావించారు.
ఇవీ చదవండి...దేశాన్ని బలహీన పరిచేలా చట్టాలు చేస్తున్నారు: ఓవైసీ