విజయనగరం జిల్లా ఒక్క కరోనా కేసు లేకుండా గ్రీన్ జోన్లో ఉందని.. ఇప్పుడు మద్యం అమ్మకాలతో జనం గుంపులుగా చేరడం వలన వైరస్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని.. తెదేపా ఎమ్మెల్సీ సంధ్యా రాణి అన్నారు. ఉదయం 11 నుంచి రాత్రి 7 గంటల వరకు మద్యం దుకాణాలు తెరవడం వలన జనసందోహం పెరిగి వైరస్ వ్యాప్తి జరిగే ప్రమాదం ఉందన్నారు. జిల్లాలో వైకాపాకు ప్రజలు 9 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లు ఇచ్చింది ఇందుకేనా అని ప్రశ్నించారు. గ్రీన్ జోన్‌గా ఉన్న జిల్లాను ప్రభుత్వం చేజేతులా రెడ్ జోన్‌గా మారేలా చేస్తోందని ఆరోపించారు. ఇంతకుముందు బయటకు రావడానికి సాకులు వెతుక్కునే ప్రజలు.. ఇప్పుడు ధైర్యంగా మద్యం దుకాణాలకు వెళ్తున్నామని చెప్పేలా చేశారని మండిపడ్డారు. మద్యం దుకాణాలు మూసివేసి జిల్లాను గ్రీన్ జోన్‌గానే ఉంచాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి... 'నిత్యావసరాలకు 3 గంటలే.. మద్యం దుకాణాలకు రోజంతా..!'