ETV Bharat / state

'హైకోర్టు మందలించినా వైకాపా నేతలు మారడం లేదు'

కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతిరాజుపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఉన్నత న్యాయస్థానం రద్దు చేసింది. హైకోర్టు చర్యలపై హర్షం వ్యక్తం చేస్తూ... విజయనగరం తెదేపా నాయకులు శ్రీ పైడితల్లి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. హైకోర్టు పలుమార్లు మందలించినా వైకాపా నేతలు మారడం లేదని విమర్శించారు.

tdp leaders comments on ycp
వైకాపా నేతలు మారడం లేదు
author img

By

Published : Jan 29, 2021, 5:42 PM IST

రామతీర్థం సహా మూడు దేవస్థానాల అనువంశిక ధర్మకర్త పదవి నుంచి అశోక్ గజపతిరాజును రాష్ట్ర ప్రభుత్వం తప్పించిన విషయం విధితమే. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు రద్దు చేసింది. ఆ తీర్పుపై హర్షిస్తూ విజయనగరంలో తెదేపా శ్రేణులు ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక శ్రీపైడితల్లి అమ్మవారి దేవాలయంలో 108 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించారు. ప్రభుత్వ తీరుపై విమర్శనాస్త్రాలు సంధించారు. హైకోర్టు వరుసగా వ్యతిరేక తీర్పులు ఇచ్చినా... వైకాపా నేతలు మారటం లేదని తెదేపా జిల్లా కార్యదర్శి ఐవీపీ రాజు విమర్శించారు.

ఇదీ చదవండి: చంద్రబాబు కోసమే నిమ్మగడ్డ పని చేస్తున్నారు: వెల్లంపల్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.