విజయనగరం కలెక్టరెట్ ఆడిటోరియంలో స్వీప్ (సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రోల్ పార్టిసిపేషన్) కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ డాక్టర్ హరి జవహర్‌లాల్ మాట్లాడుతూ... ఓటు గొప్పదనాన్ని వివరించారు. ఓటుహక్కు ఎంతో పవిత్రమైనదని, దానిని సక్రమంగా వినియోగించుకొనేవిధంగా ఓటర్లను తీర్చిదిద్దాలని కోరారు. ఎటువంటి ప్రలోభాలకు లొంగని విధంగా ఓటర్లను చైతన్యపరచాలని సూచించారు.
2021 జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండే ప్రతీ ఒక్కరికీ ఓటరుగుర్తింపు కార్డు జారీ చేయాలన్నారు. దీనికోసం విస్తృతమైన అవగాహనా కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. అక్టోబరు నుంచి కళాశాలలు తెరుచుకోనున్నాయని, విద్యాసంస్థలపై దృష్టి పెట్టి, వర్కుషాపులు నిర్వహించి కొత్త ఓటర్లను గుర్తించాలని సూచించారు. కొత్తగా ఏర్పాటైన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను, వాలంటీర్లను వినియోగించుకొని, అర్హులైన ప్రతీఒక్కరికీ ఓటుహక్కును కల్పించాలని కలెక్టర్ అన్నారు.
ఇదీ చదవండి: