విజయనగరం జిల్లా సాలూరు మండలం శివరాంపురం గ్రామంలో ప్రజల ఖాతాల్లోకి కనకవర్షం కురిసింది. గ్రామంలో 607 కుటుంబాలు ఉండగా.. సుమారు మూడు వేల జనాభా ఉన్నారు. ఇందులో దాదాపు 200 మంది బ్యాంకు ఖాతాల్లోకి అకస్మాత్తుగా డబ్బు వచ్చి పడింది. ఒక్కొక్కరికి 13 వేల 500 నుంచి 16 వేల రూపాయల వరకు వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయింది. అయితే ఇది ఏ పథకం కింద అనే విషయాన్ని ఏ ఒక్క ప్రభుత్వ అధికారి స్పష్టం చేయలేకపోతున్నారు.
రైతు భరోసా పథకానికి చెందిన డబ్బులు అనుకుందామంటే.. భూమి లేని వారికి కూడా నగదు జమ అయ్యింది. దీనిపై గ్రామంలోని ఒక వాలంటీర్ మాట్లాడుతూ... రైతు భరోసా కింద ఈ నగదు జమ అయినట్టు చెబుతున్నారు. అయితే రైతు భరోసా కింద మొత్తం 13,500 ఒకేసారి జమ కాదు అందుకే దీనిపై సందేహాలు నెలకొన్నాయి. చాలా మంది ఖాతాదారులు తమ ఖాతాల్లో డబ్బులు జమయిన విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. ఈ విషయంపై వ్యవసాయ, రెవెన్యూ అధికారులు, సచివాలయ సిబ్బంది కూడా ఎటువంటి సమాచారం ఇవ్వలేకపోతున్నారు.
ఇదీ చదవండి:
కలకలం రేపుతోన్న కాకుల మృతి..కారణాలను అన్వేషిస్తున్న అధికారులు