జాబ్ క్యాలెండర్‌ను వ్యతిరేకిస్తూ విజయనగరంలో విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టాయి. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. నోటిఫికేషన్ ఉపయోగకరం కాదంటూ కోట కూడలి వద్ద మానవహారం నిర్వహించారు. విద్యార్థి సంఘాలు కోట కూడలి నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ చేపట్టి.. కలెక్టరేట్‌ను ముట్టడించారు. ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలతో నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: