విజయనగరం కలెక్టర్ కార్యాలయం ఎదుట సామాజిక హక్కుల పోరాట వేదిక నాయకులు నిరసన చేపట్టారు. క్రషీ, లింక్ వర్కర్లనే అంగన్వాడీ కార్యకర్తలుగా, సహాయకులుగా నియమించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్ల ఖాళీ పోస్టులను క్రషీ,లింక్ వర్కర్లకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అంగన్వాడీ కేంద్రాలను ప్రీ ప్రైమరీ స్కూల్స్ గా తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి ప్రకటించినందున గతంలో పనిచేసిన క్రషీ, లింక్ వర్కర్లు అందరిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సామాజిక హక్కుల పోరాట వేదిక జిల్లా అధ్యక్షులు పాలక రంజిత్ కుమార్, కార్యదర్శి తాడంగి సాయిబాబు, ఉపాధ్యక్షులు ఊయక గంగరాజు, క్రషీ, లింక్ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: