ఉత్తరాంధ్ర పరిధిలోని విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం మీదుగా జాతీయ రహదారి విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. లాక్డౌన్ కారణంగా ఆగిన పనులు యధావిధిగా పునరుద్ధరించారు. చెన్నై నుంచి కోల్కతా వరకు వెళ్లే ఈ రహదారులు అత్యాధునికంగా రూపుదిద్దుకుంటుంది.
2018 జనవరిలో పనులు ప్రారంభించగా 2020 ఆగస్టు 15 నాటికి పూర్తి చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆనందపురం నుంచి రణస్థలం వరకు 54 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ రహదారికి సుమారు రూ.1387 కోట్లు వెచ్చిస్తున్నారు. ఇందులో చిన్న, పెద్ద కలిపి మొత్తం 29 వంతెనలు నిర్మించనున్నారు.
ఇవీ చూడండి...