SFI Dharna in parvathipuram: విజయనగరం జిల్లా పార్వతీపురంలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల విద్యార్థులు.. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కదం తొక్కారు. కళాశాలను ప్రభుత్వం విలీనం చేసుకోవాలని కొద్ది రోజులుగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేపట్టారు. అధికారులు ఎవరూ స్పందించక పోవడంతో.. నిరసన ర్యాలీ చేపట్టారు.
కళాశాల నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు సుమారు రెండు కిలోమీటర్లు నినాదాలు చేస్తూ.. రోడ్డుపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి నిరసనకారులను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
ఇదీ చదవండి: 'అన్నంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు చెప్పినా.. ఉపాధ్యాయులు నిర్లక్ష్యం చేశారు'