యువజన సర్వీసుల శాఖ ఏర్పాటు చేసిన ఉచిత ఆన్‌లైన్ శిక్షణా తరగతులను వినియోగించుకొవాలని సెట్విజ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి పి.నాగేశ్వర్రావు విజయనగరంలో కోరారు.. ఈ శిక్షణా తరగతులకు సంబంధించిన కరపత్రాలను తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ శిక్షణ .... విద్యార్థులకు గొప్ప సదావకాశమని ఆయన పేర్కొన్నారు. కరోనా కాలంలో ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్న 15 నుంచి 35 ఏళ్ల మధ్యవయసున్నవారంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు. విజయవాడ నుంచి యువజన సర్వీసులశాఖ డైరెక్టర్ ఆధ్వర్యంలో యోగ, ధ్యానంపై ఉచిత శిక్షణ ఇస్తారని అన్నారు. ప్రతిరోజు ఉదయం 6 గంటలు నుంచి 7.15 వరకూ ఈ కార్యక్రమం జరగనుంది. యోగా వల్ల అనేక ఇతర ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు.
వ్యక్తిత్వ వికాసంపై అక్టోబరు 17 నుంచి ప్రతి శనివారం ఉదయం 10 గంటలు నుంచి 11.30 వరకు శిక్షణా కార్యక్రమం జరుగుతుందని... జూమ్ , యూట్యూబ్ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ద్వారా తరగతులను వినొచ్చని సూచించారు. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు గొంపా నాగేశ్వర్రావు, యండమూరి వీరేంధ్రనాథ్, పద్మలు క్లాసులు నిర్వహిస్తారన్నారు. ఆంగ్లం, కమ్యూనికేషన్ స్కిల్స్‌పై ప్రతీ శనివారం, బుధవారం సాయంత్రం 5 గంటలు నుంచి 6.30 వరకు జరుగుతాయని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకోసం 7396219578 నెంబరుకు సంప్రదించాలని సీఈఓ సూచించారు. ఈ సమావేశంలో సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస చౌదరి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి. ప్రేమోన్మాది దాడి: యువతి శరీరంపై 13 కత్తిగాట్లు