ETV Bharat / state

విత్తనశుద్ధితో పంటలకు అనేక లాభాలు... తగ్గుతున్న పెట్టుబడుల ఖర్చు - విత్తన శుద్ది లేటేస్ట్ న్యూస్

ప్రకృతి వ్యవసాయంలో భాగంగా విజయనగరం జిల్లా కురుపాం రైతులు.. విత్తనాలను బీజామృతంతో శుద్ధి చేసుకొని... భూమి నుంచి వ్యాపించే అన్ని రకాల తెగుళ్లు నివారించుకుని అధిక దిగుబడులను సాధిస్తున్నారు.. వ్యవసాయ అధికారులు, జడ్బీఎన్​పీ సిబ్బంది రైతులకు విత్తన శుద్ధిపై అవగాహన కలిపిస్తున్నారు. దీంతో రైతులు బీజామృతం తయారు చేసుకొని విత్తనాలను శుద్ధి చేసుకొని అధిక లాభాలు పొందుతున్నారు. అంతేకాకుండా విత్తన శుద్ధి చేయటం వల్ల 100 శాతం విత్తనాలు మొలకెత్తుతాయని, నారు ఏపుగా పెరుగుతుందని తెలిపారు రైతులు.

seed cleaning process in vizianagaram
విత్తనశుద్ధితో పంటలకు అనేక లాభాలు
author img

By

Published : Jun 26, 2020, 5:27 PM IST

విత్తనశుద్ధితో పంటలకు అనేక లాభాలు

విత్తనాల ద్వారా ఆహారాన్ని ఆశించే పురుగులు, తెగుళ్లను నివారించడానికి, అదే విధంగా మొలకదశలో నేలలో ఉండే కీటకాలు, శిలీంద్రాల నుంచి విత్తనాలను కాపాడటానికి... విత్తనాలను సరైన పద్ధతిలో శుద్ధి చేయడాన్ని విత్తనశుద్ధి అంటారు. రైతులు ఈ పద్ధతిని పాటిస్తే చీడపీడలు దూరం కావడంతోపాటు పంటలు అధిక దిగుబడి వస్తాయి. దీంతోపాటు పెట్టుబడి ఖర్చు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ విధంగా విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో రైతులు మూడేళ్లుగా అధిక దిగుబడులు సాధిస్తున్నారు.

పంట దిగుబడి విత్తన నాణ్యతపై ఆధారపడి ఉంటుంది

నాణ్యమైన విత్తనం అంటే.. జన్యుపరమైన అసలు లక్షణాలు, మొలక శాతం, మొలకెత్తే శక్తిని కలిగి ఉండడం. ఇటువంటి విత్తనాలను ఉపయోగించడం వల్ల అధిక దిగుబడులు సాధించవచ్చు. విత్తనోత్పత్తి పంటల్లో కోత తర్వాత విత్తనాన్ని నూర్చి 12 శాతం తేమ కంటే తక్కువ వచ్చే వరకు ఆరబెట్టాలి. ఈ విధంగా ఎండబెట్టి సరైన పద్ధతిలో నిల్వచేయకపోతే విత్తనం నాణ్యత... అంటే రంగు, పుష్టి తగ్గిపోయి, శిలీంద్రాల వ్యాప్తి జరిగి మొలకశాతం, మొలకెత్తే శక్తి తగ్గి క్రమంగా విత్తనం నిర్జీవమైపోతుంది. అందువల్ల విత్తన పంటను సరైన పద్ధతిలో శుభ్రపరచి, తగిన తేమశాతం వచ్చే వరకు ఎండబెట్టి విత్తనశుద్ధి చేసి నిల్వ చేసుకోవాలి.

విత్తనాలు ఆరోగ్యమైనవైనా... కోత కోసేటప్పుడు, నూర్పిడి జరిగేటప్పుడు కొన్ని శిలీంద్ర భాగాలు విత్తనాలతో కలిసి పంటను ఆశిస్తాయి. విత్తనాలలో తెగుళ్లను కలుగజేసే సూక్ష్మక్రిములు బీజాల రూపంలో ఉండి తిరిగి విత్తనాలను నాటినప్పుడు చీడపీడల రూపంలో బయటపడతాయి.

సాధారణంగా రైతులు పైరుకు తెగుళ్లు ఆశించినప్పుడు మాత్రమే శిలీంద్ర రసాయనాలను పిచికారి చేస్తారు. తెగుళ్లు ప్రారంభ దశలోనే గమనించక పోవటం, సకాలంలో సస్యరక్షణ చేపట్టకపోవడం వల్ల తెగుళ్ల నివారణ రైతులకు కష్ట సాధ్యమవుతుంది. విత్తనం మంచిదైతేనే పంట బాగుంటుంది. కాబట్టి కనిపించని శిలీంద్రాల బారి నుంచి పలు విత్తనాలను రక్షించుకోవాలంటే విత్తనశుద్ధికి ఎంతో ఆవశ్యకత ఉంది.

విత్తన శుద్ధి ద్వారా... చీడపీడల నివారణ

విత్తనాలకు నేల నుంచి సంక్రమించే వ్యాధులు పంటలకు అగ్గితెగులు, ఆకుమచ్చ, పొడతెగులు, పొట్ట కుళ్ల తెగులు శిలీంద్రాల ద్వారా వ్యాపిస్తాయి. బాక్టీరియా వల్ల వచ్చే ఆకు ఎండు తెగులు విత్తనం ద్వారా వ్యాపిస్తుంది. ఇలాంటి చీడపీడల నివారణ... విత్తన శుద్ధి ద్వారా చాలావరకు సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. నారుపోయక ముందు విత్తనాలను రసాయనాలతో శుద్ధి చేస్తే విత్తనంపై ఉన్న సిద్ధ బీజాలు చనిపోతాయి. విత్తన శుద్ధి చేపడితే నారు మడిలోనూ, నాటిన తర్వాత కొన్నిరోజుల వరకు ఈ తెగుళ్ల వల్ల నష్టం రాకుండా నివారించుకోవచ్చు. దీని ద్వారా అధిక దిగుబడులు పొందవచ్చు. విత్తన శుద్ధికి అయ్యే ఖర్చు తక్కువగానే ఉంటుంది.

విత్తన శుద్ధి పూత పద్ధతులు

  • ఒక కిలో విత్తనాలకు గ్రాము కార్భండి జమ్‌ లేదంటే కాప్టాన్‌ లేదంటే థైరామ్‌ లేదంటే మాంకోజెట్‌ 2.5 గ్రాములు చొప్పున కలిసి విత్తన శుద్ధి చేసుకోవాలి.
  • ఇది సాధారణంగా పూత ఎక్కువగా వాడే విత్తనశుద్ధి. ఈ పద్ధతిలో విత్తనానికి ద్రవరూపంలో, పొడి రూపంలోని మందులను ఉపయోగించి విత్తనాలకు సంరక్షణ చేపట్టవచ్చు. ఈ పద్ధతిని పరిశ్రమల్లో ఎక్కువగా వాడతారు.
  • ఈ పద్ధతిలో మందులను విత్తనాన్ని పట్టుకోవడానికి ఒక ప్రత్యేకమైన జిగురు పదార్ధాన్ని ఉపయోగిస్తారు.

విత్తనశుద్ధి వల్ల కలిగే ప్రయోజనాలు

  • విత్తనం ద్వారా లేదంటే నేల ద్వారా వ్యాపించే వ్యాధులు తెగుళ్లు, పురుగులను సమర్థవంతంగా నివారించడానికి దోహదపడుతుంది.
  • శుద్ధికి వినియోగించే మందులు విత్తనంలోకి చొచ్చుకునిపోయి శిలీంద్ర బీజాలను నాశనం చేస్తాయి.
  • పప్పు జాతి పంట మొక్కల వేర్లపై వేరు బుడిపెలు సంఖ్య పెరుగుతుంది.
  • పంటలకు దిగుబడి వచ్చేవరకు ఆశించే చీడపీడలను నిర్మూలించడానికి విత్తనశుది ఎంతగానో ఉపయోగపడుతుంది.
  • విత్తనశుద్ధి చేసిన తర్వాత మొలకెత్తిన లేత మొక్కలు నేలలో ఉన్న శిలీంద్రాల నుంచి రక్షణ పొందుతాయి. శుద్ధి చేసిన తర్వాత నిల్వ ఉంచిన ఆశించే పురుగుల నుంచి రక్షణ పొందవచ్చు.
  • తక్కువ ఖర్చుతో తెగుళ్లను, పురుగులను పంటలకు ఆశించకుండా చేయవచ్చు.

ఇదీ చదవండి: 'వైకాపా ఏడాది పాలన అంతా కుంభకోణాల మయం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.