విజయనగరం జిల్లా మక్కువ మండలం శంబర గ్రామంలో శంబర పోలమాంబ జాతరను ఘనంగా నిర్వహించారు. వేడుకలో భాగంగా గ్రామ పొలిమేరల నుంచి అమ్మవారి ఘటాలను పూజారి, జన్ని, గిరడ, నాయుడు, కరణం కుటుంబ సభ్యులు చేతులపై మోసుకొచ్చారు. మేళతాళాలు, గిరిజన వాయిద్యాలు, వేలాది మంది భక్తుల మధ్య అమ్మవారు గ్రామంలోని చదురు గుడికి తరలివచ్చారు. ఈ క్రార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొని అమ్మవారి దీవెనలు పొందారు.
ఇదీచదవండి.