విజయనగరం జిల్లా సాలూరు మున్సిపల్ కార్యలయంలో గురువారం కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. కౌన్సిల్ హాల్లో జరిపిన ఈ సమావేశంలో కొత్తపాలక వర్గం కొలువు తీరింది. కొత్తగా ఎన్నుకున్న చైర్మన్ పువ్వల ఈశ్వరమ్మ అధ్యక్షతన.. జరిపిన ఈ సమావేశంలో వార్డు కౌన్సిలర్లు అందరూ పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్గా తనను ఎన్నుకున్నందుకు.. ఈశ్వరమ్మ అందరికి కృతజ్ఞతలు తెలియజేశారు.
కౌన్సిలర్లు మాట్లాడుతూ.. చైర్మన్ చాంబర్లో మార్పులు చేసేందుకు.. మున్సిపల్ ఏఈ, డీఈ ఎస్టిమేషన్ను ఎక్కువగా చూపిస్తున్నారని ఆరోపించారు. 2.50 లక్షలు రూపాయలు అయితే.. అదనంగా మూడు లక్షలు అవుతుందని రాంగ్ ఎస్టిమేషన్ వేశారన్నారు. దీనికి డీఈ.శేఖర్ వివరణ ఇవ్వాలని కోరారు.
ఒక్క రోజు జేసీబీతో చేసే పని కోసం మూడు లక్షల రూపాయల ఖర్చు చూపించటం చాలా తప్పు అని వ్యాఖ్యనించారు. ప్రజల సొమ్ము ప్రజల అవసరాలకు వాడాలని.. సింగిల్ టెండరు విధానం అనేది ఏ ఒక్క వార్డు సంబంధించింది కాదని.. ఇస్తే అన్ని వార్డులకి ఇవ్వాలని కోరారు. వేసవి కాలం దృష్టిలో పెట్టుకొని వాటర్ సదుపాయం కోసం పాత బోర్లు మరమ్మతులు, కొత్తగా మోటార్లు ఏర్పాటు చేయడానికి వేసిన ఎస్టిమేషన్ కూడా తేడాగా ఉందని అధికార పార్టీ కౌన్సిలర్లు నిలదీశారు. దీంతో కౌన్సిల్ హాల్లో గందరగోళం ఏర్పడింది.
ఇవీ చూడండి..