ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో తమ పార్టీకి అనుకున్న విధంగా ఫలితాలు రాలేదని ఏపీసీసీ శైలజానాథ్ అన్నారు. అయితే.. కుల, మతాలను అడ్డుపెట్టుకొని జగన్‌లాంటి వాళ్ల అండతో రైతులను ట్రాక్టర్లతో తొక్కించిన భాజపాకు ఓట్లు పడటం ఆశ్చర్యకరమని అన్నారు. డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా విజయనగరంలో పర్యటించిన ఆయన.. నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన శైలజానాథ్.. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తమ పార్టీకి అనుకూలంగా రాలేదన్నారు. ఈ ఫలితాలతో దేశంలో సగటు మనిషికి జీవించే హక్కు లేకుండా భాజపా చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రహదారుల అభివృద్ది పేరుతో ఇప్పటికే గిరిజన ప్రాంతాల్లోని ఖనిజాన్ని దోచుకునే చర్యలకు పూనుకుందని ఆరోపించారు.
ఇప్పటికే విశాఖ ఉక్కు కర్మాగారం పరిస్థితిని ప్రత్యక్షంగా చూస్తున్నామన్నారు. లౌకిక భారత దేశాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని శైలజానాథ్ అన్నారు. సభ్యత్వ కార్యక్రమం పాత కవచాలను చేధించుకుంటూ నూతన శక్తితో ఈ దేశాన్ని కాపాడే బాధ్యతను తీసుకుంటుందన్నారు.
ఇదీ చదవండి :
bjp office: భాజపా కార్యాలయాల వద్ద సంబరాలు