మల్లివీడు సమీపంలో ఓ ద్విచక్రవాహనాన్ని.. బొలేరో వాహనం ఢీకొట్టింది. వేపాడ మండలం వీలుపర్తి గ్రామానికి చెందిన చుక్క కిషోర్, కె.యేసు అనే ఇద్దరు మిత్రులు కొత్తవలస వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన వీరిని శృంగవరపుకోట సామాజిక ఆసుపత్రికి తరలించారు. యేసుకు కాలు విరిగింది. కిషోర్ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఇదీ చదవండి:
ఒడిశాలో ట్రాలీ ఆటో బోల్తా, నలుగురికి తీవ్ర గాయాలు.. విశాఖకు తరలింపు