ETV Bharat / state

విజయనగరం మొదటి ఉప మేయర్​గా​ రేవతీదేవి ఏకగ్రీవం - విజయనగరం జిల్లా

విజయనగరం మొదటి ఉప మేయర్​గా రేవతీ దేవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రత్యేక అధికారి.. సంయుక్త కలెక్టర్ కిశరో కుమార్ ఆధ్వర్యంలో ఈ ఎన్నిక జరిగింది.

vijayanagaram
విజయనగరం మొదటి ఉప మేయర్​గా​ రేవతిదేవి
author img

By

Published : Aug 4, 2021, 5:19 PM IST

విజయనగరం కార్పొరేషన్ మొదటి డిప్యూటీ మేయర్​గా 13వ డివిజన్ కౌన్సిలర్ రేవతీదేవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత డిప్యూటీ మేయర్ ముచ్చు నాగలక్ష్మి.. మే 4వ తేదీన కరోనా కారణంగా మృతి చెందింది. ఆమె మరణంలో ఖాళీ ఏర్పడిన మొదటి డిప్యూటీ మేయర్ ఎన్నికను ఈ రోజు నిర్వహించారు.

ప్రత్యేక అధికారి.. సంయుక్త కలెక్టర్ కిశరో కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికలో మొదటి డిప్యూటీ మేయర్​గా రేవతిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 36వార్డు కౌన్సిలర్ పద్మావతి.. రేవతిని మొదటి డిప్యూటీ మేయర్​గా ప్రతిపాదించగా.. 21వ డివిజన్ కార్పొరేటర్ నాగవల్లి బలపరిచారు. ఈ క్రమంలో.. రేవతి మొదటి డిప్యూటీ మేయర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. ఆమెకు ఎన్నిక ధృవీకరణ పత్రం అందచేశారు.

అనంతరం రేవతిని, మేయర్, మహిళా కార్పొరేటర్లు, శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి అభినందించారు. డిప్యూటీ మేయర్ గా అవకాశం కల్పించిన మేయర్, కార్పొరేటర్లు, శాసనసభ్యునికి రేవతి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇదీ చదవండి:

దేవాదాయశాఖ అధికారుల సమక్షంలో ఆలయాల ఆభరణాల లెక్కింపు పూర్తి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.