విజయనగరం జిల్లావ్యాప్తంగా 2 లక్షల 84వేల 483 రైతు కుటుంబాలు... రైతుభరోసా పథకానికి అర్హులుగా అధికారుల లెక్కలు తేల్చాయి. బలిజపేట మండలంలో గ్రామస్థాయి అధికారులతో చేతులు కలిపిన కొందరు నాయకులు... నకిలీ కౌలు రైతుల ఖాతాలను సృష్టించి డబ్బులను పక్కదారి పట్టించడం ప్రారంభించారు. మండలంలోని ఒక్క నారాయణపురంలోనే 88మంది అనర్హులను కౌలుదారులుగా సృష్టించి... రైతుభరోసా సొమ్ములు స్వాహా చేశారు.
అనర్హుల ఖాతాల్లో డబ్బులు జమవుతున్నాయని... తమకు మాత్రం చిల్లిగవ్వ అందలేదంటూ కొందరు అర్హులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నారాయణపురం వీఆర్వోకు తెలియకుండానే అనర్హులను జాబితాలో చేర్చారని... ఈ అంశంపై ఇప్పటికే చర్యలు ప్రారంభించామని బలిజపేట తహశీల్దార్ గణపతిరావు అంటున్నారు.
బలిజపేట మండలంలో వెలుగుచూసిన అక్రమాలపై లోతైన విచారణ జరిపించి... బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.
ఇవి కూడా చదవండి: